Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (2024)

Krishna Mukunda Murari Today: సీరియల్‌ 86 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ముకుంద.. మురారీ జీవితంతో ఆడుకుంటున్న సంగతి.. రేవతి తెలుసుకుంటుంది. గత ఎపిసోడ్‌లో మురారీతో పాటు.. మురారీ స్నేహితుడు గోపి.. రావడం.. తెలిసిందే. ఆ సమయంలోనే వెలెటైన్స్ డే సందర్భంగా ఒక్కొక్కరు ప్రేమ గురించి చెప్పడం.. ముకుంద కావాలనే మురారీకి గులాబీ ఇచ్చి హ్యాపీ వెలెటైన్స్ డే అని చెప్పడం.. అంతా తెలిసిందే. అయితే ముకుంద.. ఆదర్శ్‌ కోసం చెబుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. మురారీ గురించి చెప్పడం కూడా రేవతి.. అనుమానానికి బలాన్ని ఇచ్చింది. దాంతో వెంటనే ముకుంద గురించి.. మురారీ గతంలో ఏం జరిగిందో నిజం చెప్పు గోపీ అంటూ.. ఒట్టు పెట్టుకుని మరీ ఆరా తీస్తుంది రేవతి. దాంతో గోపీ నోరు విప్పుతాడు. ‘పిన్నీ వాడు ఇప్పటికే నరకం అనుభవిస్తున్నాడు.. ఇప్పుడు నిజం నీకు తెలిసింది అంటే అసలు భరించలేదు’ అంటాడు గోపీ. దాంతో ‘సరే అయితే.. నాకు తెలిసినట్లు నేను ఉండను.. నువ్వు చెప్పకు.. కానీ నిజం ఏంటో నాకు పూర్తిగా చెప్పు’ అంటుంది రేవతి. దాంతో గోపీ మొత్తం ముకుంద, మురారీల జీవితంలో జరిగిన ప్రేమ వ్యవహారం గురించి.. ముకుందకు మురారీ ఇచ్చిన మాట(మరో అమ్మాయి నా జీవితంలో ఉండదు) గురించి.. అంతా చెబుతాడు.

అల్లాడిన రేవతి..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (1)

‘కానీ ఇప్పుడు ముకుంద మురారీని చాలా ఇబ్బందిపెడుతోంది. తన ప్రేమ ఉన్మాదంగా మారిపోయింది.. అంతే పిన్నీ నాకు తెలిసింది’ అంటూ గోపీ వెళ్లిపోతాడు. దాంతో రేవతి అక్కడే నిలబడి.. గతంలో ముకుంద ప్రవర్తనను.. మురారీని ఇబ్బందిపెట్టే సీన్స్ అన్నీ గుర్తు చేసుకుంటుంది. అక్కడే కూలబడి బాగా ఏడుస్తుంది. ‘నా బిడ్డ ఇంత బాధపడతున్నాడా? ముకుంద ఇంత బాధపెడుతుందా?’అనుకుంటూ కుమిలిపోతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నీ ఊహల్లో నీ జ్ఞాపకాల్లో బతుకుతాను తప్ప.. నా జీవితంలో మరో అమ్మాయికి చోటు లేదు’ అని మాటిచ్చాడు మురారీ అంటూ గోపీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి.

కొడుకుని అర్థం చేసుకుని..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (2)

రేవతి తనలో తానే.. ‘మురారీ ఇంతకాలం ముకుందతో పాటు నిన్ను అపార్థం చేసుకున్నాను కదరా.. ఇంత నరకం అనుభవిస్తున్నావా రోజు.. ఇప్పుడు నిన్ను ఎలా కాపాడుకోవాలి? కృష్ణని ఎలా కాపాడుకోవాలి.? మీ కాపురంలో కలతలు రాకుండా ఎలా చూసుకోవాలి? ఆ ముకుంద ప్రేమ ఉన్మాదంగా మారిపోయి.. నీ కాపురాన్ని కూల్చేకముందే ఏదొకటి చెయ్యాలి’ అంటూ కుమిలికుమిలి ఏడుస్తుంది రేవతి. ఇక కాసేపటికి.. రేవతి.. కళ్లు తుడుచుకుని బయటికి వస్తుంది. అలేఖ్య, ముకుంద, భవానీ, సుమలతా అంతా సరదగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క మురారీ తప్పా అంతా హ్యాపీగా ఉంటారు. అది చూస్తూనే ఉంటుంది రేవతి.

కామెడీ సీన్‌లో ఎమోషనల్..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (3)

మధుకర్‌ని ఎదురుగా ఉంచుకుని.. మురారీ తండ్రి, మురారీ వాళ్ల బాబాయ్(మధుకర్ తండ్రి) మందు కొడుతూ ఉంటారు. అప్పుడే మధుకర్.. ‘నాన్నా ప్లీజ్ నాకు కూడా కొంచెం’ అంటూ గ్లాస్ పట్టుుకుని ఆరాటపడటంతో.. మధుకర్ వాళ్ల నాన్న.. ‘ముందు నువ్వు మందు ఎక్కువ వాడిలా యాక్ట్ చేసి చూపించు రా’ అనడంతో.. మధుకర్.. అలా యాక్ట్ చేస్తాడు. దాంతో మధుకర్ వాళ్ల నాన్న మురారీ వాళ్ల నాన్నతో.. ‘వీడికి మందు ఎక్కువైదన్నయ్యా.. వీడికి మందు పోయొద్దు..’ అనేసి చుక్క కూడా మధుకర్‌కి దొరక్కుండా తనే తాగేస్తాడు.. ఆ సీన్ అంతా కామెడీగా సాగుతూ ఉంటుంది. అక్కడే పాపం రేవతి బాధతో వాళ్ల ఆనందాన్ని కూడా చూస్తుంది. ఇక పాపం మురారీ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్న సీన్ చూసి.. తల్లిగా చాలా ఎమోషనల్ అవుతుంది.

నందు గతంలో..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (4)

ఇక కాసేపటికి నందు ఆడుకుంటూ ఉంటే.. కృష్ణ భోజనం తెచ్చి.. ‘నందు ఎందుకు తినలేదు.. ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి సరిపోతుంది. రేపు నేను లేకపోతే ఏం చేస్తావ్’ అంటుంది. ‘నువ్వు ఎక్కడికి వెళ్తావ్.. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తా’ అంటుంది నందు. ‘మరి నాతో రేపటి నుంచి కాలేజ్‌కి వస్తావా? అంటుంది కృష్ణ. ‘కాలేజ్.. కాలేజ్..’ అంటూ నందు ఏదో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అదేం పట్టించుకోని కృష్ణ.. ‘నేను డాక్టర్ చదువుతాను కదా అందుకే కాలేజ్‌కి వెళ్తాను’ అంటూ ఉంటుంది. వెంటనే నందు.. ‘కాలేజ్.. కాలేజ్.. సిద్ధూ..’ అంటూ టెన్షన్‌తో పైకి లేస్తుంది.

గుర్తొస్తుంది నందు..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (5)

దాంతో కృష్ణ కంగారుపడుతుంది. ‘ఏం అయ్యింది నందు.. నువ్వేం చెబుతున్నావో నాకేం అర్థం కావట్లేదు.. సిద్ధు ఎవరు? కాలేజ్ ఏంటీ?’ అంటుంది కృష్ణ. ‘ఏమో నాకేం తెలియదు.. నాకు గుర్తు రావట్లేదు’ అంటుంది నందు. వెంటనే కృష్ణ .. నందుని ఎక్కువ టెన్షన్ పడనీయొద్దు అనుకుని.. ‘సరే నువ్వు అన్నం తింటే నీకు అన్నీ గుర్తొచ్చేస్తాయి’ అంటుంది. అవునా నిజమా తినిపించు అంటుంది నందు. ‘నేను ఇక నుంచి నీకు తినిపించను.. నువ్వే తినడం నేర్చుకోవాలి’ అంటూ స్పూన్‌తో తినడం నేర్పిస్తుంది. నందు తింటుంటే.. ‘గుడ్ గర్ల్ అంటుంది కృష్ణ.

కృష్ణకు క్లారిటీ..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (6)

‘నేను నిజంగానే గుడ్ గర్ల్‌నా.. మరి అమ్మెందుకు ఎప్పుడూ తిడుతుంది?’ అంటుంది నందు. ‘అది కోపం కాదు.. ప్రేమే’ అంటుంది కృష్ణ. ‘అవునా.. ప్రేమంటే ఏంటి కృష్ణ?’ అంటుంది నందు. ‘ప్రేమ అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒకరి సంతోషం కోసం మరొకరు ఆరాటపడటమే ప్రేమంటే..’ అంటుంది కృష్ణ. దాంతో వెంటనే నందు ఏదో ఆలోచిస్తున్నట్లుగా.. ‘అంటే సిద్ధుకి నా మీద.. కాదు కాదు.. సిద్దు మీద నాకున్నది.. కాదు కాదు.. మా ఇద్దరి మధ్యా.. ఉన్నది ప్రేమ కాదేమో కాదా? ఏమో నాకేం తెలియదు.. సిద్ధూ గురించి చెబితే అమ్మ కోప్పడుతుంది. టాబ్లెట్ ఇచ్చేస్తుంది. అమ్మో అమ్మ వచ్చేస్తుంది.. నేను లోపలకి వెళ్లి తింటాను..’ అనేసి ప్లేట్ తీసుకుని వెళ్లిపోతుంది.

ముకుందకు చెక్..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (7)

విషయం అర్థం చేసుకున్న రేవతి.. ‘అంతమాత్రానికి అంత దూరం దేనికి ముకుందా.. ఈ వీధి చివర.. నీలిమా ఆసుపత్రి ఉందిగా దానికి వెళ్దువగానీ.. అమ్మా కృష్ణా మురారీ.. మీరు బయలుదేరండి లేదంటే.. దుర్ముహూర్తం(ముకుందని).. వెంటనేసుకుని వెళ్లాల్సి వస్తుంది’అంటూ పంపించేస్తుంది. మొత్తానికి ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసింది రేవతి. కృష్ణ, మురారీలు కాలేజ్‌కి బయలుదేరతారు. ముకుంద రగిలిపోతూ పైకి వెళ్తుంది. ఇక కృష్ణ.. తింగరి ప్రవర్తనతో.. కాలేజ్ పిన్సిపాల్ ముందు కంగారుకంగారుగా.. సర్టిఫికెట్ పడేసుకోవడం.. ఇలా కాలేజ్‌లో కూడా బిత్తరబిత్తరపనులు చేస్తోంది. ఆ హైలైట్స్ రేపు చూద్దాం. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కృష్ణ ముకుంద మురారి’ Krishna Mukunda Murari కొనసాగుతోంది. (photo courtesy by star maa and disney+ hotstar)

Read also: ‘జానకి కలగనలేదు’ ఫిబ్రవరి 21 ఎపిసోడ్:జ్ఞానాంబ బతికే ఛాన్స్ లేదు.. కుమిలికుమిలి ఏడ్చిన జానకి

సంతాన ప్రాప్తిరస్తూ..

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (8)

వెంటనే కృష్ణ .. ‘ఈ సిద్ధు ఎవరు? నందినికి ఏదో గతం ఉంది.. అది ఏంటో వెంటనే కనిపెట్టాలి’ అని ఫిక్స్ అవుతుంది. మరునాడు ఉదయాన్నే కృష్ణ, మురారీ ఇద్దరూ కలిసి కాలేజ్‌లో జాయిన్ కావడానికి బయలుదేరతారు. అది చూసిన ముకుంద.. రగిలిపోతుంది. ‘కాలేజ్‌కి వెళ్లొస్తాను అత్తయ్యా నన్ను ఆశీర్వదించండి’ అంటూ కృష్ణ.. రేవతి కాళ్ల మీద పడితే.. ‘సంతాన ప్రాప్తిరస్తూ.. నువ్వు డాక్టర్ అమ్మ కావడం కంటే.. అమ్మవి కావడమే నాకు ముఖ్యం’ అంంటుంది ఎమోషనల్‌గా రేవతి. ఇంతలో ముకుంద వాళ్ల దగ్గరకు వచ్చి.. ‘కృష్ణా మీరు ఎలాగో ఆసుపత్రి ఉన్న కాలేజ్‌కే కదా వెళ్తున్నది.. నేను వస్తాను.. నాకు హెల్త్ బాలేదు’ అంటుంది మురారీని చూస్తూ.

Krishna Mukunda Murari ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (9)

శేఖర్ కుసుమ గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... Read More

Krishna Mukunda Murari  ఫిబ్రవరి 21 ఎపిసోడ్: ముకుంద ప్లాన్‌ని చిత్తు చేసిన రేవతి.. నందిని గతంపై కృష్ణకు క్లారిటీ.. (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Prof. Nancy Dach

Last Updated:

Views: 5903

Rating: 4.7 / 5 (57 voted)

Reviews: 80% of readers found this page helpful

Author information

Name: Prof. Nancy Dach

Birthday: 1993-08-23

Address: 569 Waelchi Ports, South Blainebury, LA 11589

Phone: +9958996486049

Job: Sales Manager

Hobby: Web surfing, Scuba diving, Mountaineering, Writing, Sailing, Dance, Blacksmithing

Introduction: My name is Prof. Nancy Dach, I am a lively, joyous, courageous, lovely, tender, charming, open person who loves writing and wants to share my knowledge and understanding with you.