ఇంటికి వచ్చేస్తున్న ఆదర్శ్.. టెన్షన్‌తో తలపట్టుకున్న ముకుంద! (2024)

Krishna Mukunda Murari Today Episode:కృష్ణ, మురారిలు ఆదర్శ్‌ని కలుస్తారు. ఆదర్శ్‌ని ఇంటికి వచ్చేయ్‌మని రిక్వెస్ట్ చేస్తారు. ఆదర్శ్ రాను అని అంటే కృష్ణ మోటివేట్ చేస్తుంది. ఆదర్శ్‌ ముకుందని ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తుచేసి మనసు మారేలా మాట్లాడుతుంది. తన ప్రేమని దక్కించుకోమని చెప్తుంది. దీంతో ఆదర్శ్‌ వస్తాను అని ఒప్పుకుంటాడు.

ఆదర్శ్‌: నేను వస్తాను కానీ అక్కడ ఏం జరిగినా బాధ్యత మీదే.. ఏంటి మౌనంగా ఉన్నారు. అంటే మీకు కూడా నమ్మకం లేదు అన్నమాట అందుకే ఆలోచనలో పడ్డారు.
కృష్ణ: లేదు లేదు మేం ఆలోచిస్తుంది దాని గురించి కాదు.. ఇక్కడికి వచ్చే ముందు ఏం జరిగింది అంటే... అని ముకుంద అన్న దొరికిపోవడం ముకుంద కృష్ణ వాళ్లని ఇబ్బంది పెట్టను అని చెప్పిన సంగతులు చెప్తుంది.
ఆదర్శ్‌: సరే నా రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అవుదాం.

మరోవైపు భవాని వాళ్లు అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. మధు మురారి వాళ్లకు ఫోన్ చేస్తూ ఉంటాడు. స్విఛ్‌ ఆఫ్ వస్తూనే ఉంటుంది. ఇద్దరి నెంబర్లు అవ్వడం లేదని మధు చెప్తాడు. ఇక కృష్ణ రాత్రి ఫోన్ చేసి ధాబా దగ్గర ఉన్నామని చెప్పి మాట్లాడిందని.. తర్వాత నుంచి ఫోన్ చేయలేదని రేవతి చెప్తుంది. దీంతో భవాని కూడా ఆలోచనలో పడుతుంది. అందరూ కాస్త కంగారు పడతారు.

భవాని: అసలు ఏ ఊరు వెళ్లారు.
సుమలత: అదేదో ఊరు అక్క పాకిస్థాన్ బోర్డర్‌కి దగ్గర అంట.. అయినా తెలీగానే ఇద్దరూ వెళ్లకపోతే మిగతా వాళ్లని తీసుకెళ్లి ఉంటే బాగున్ను కదా..
ప్రసాద్: వారేమైనా యుద్ధానికి వెళ్లారా ఆదర్శ్‌ని తీసుకురావడానికే కదా..
భవాని: వాళ్లు యుద్ధానికి వెళ్లకపోవచ్చు. కానీ వెళ్లింది మాత్రం యుద్ధం జరిగే చోటుకే కదా..
మధు: పెద్ద పెద్దమ్మ మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని టెన్షన్ పడకండి.
ముకుంద: మనసులో.. కృష్ణ, మురారిలు అక్కడికి చేరిపోయి ఉంటారా.. ఆదర్శ్‌ని కలిసి ఉంటారా.. దేవుడా.. ఆదర్శ్‌ ఒప్పుకుంటాడా.. మనసులో ఉండే మనిషితో కలిసి బతకడమే కష్టం అనుకుంటే ఆ మనిషి పక్కనే ఉండగా వేరే ఒకరితో కలిసి బతికే పరిస్థితి రావడం ఎంత నరకంగా ఉంటుంది. భగవంతుడా ఎందుకీ పరీక్ష పెడుతున్నావ్.

కృష్ణ, మురారిలు ఆదర్శ్‌ రూమ్‌కి వెళ్తారు. కృష్ణ ఆదర్శ్‌ బ్యాగ్ రెడీ చేస్తుంటుంది. తర్వాత వంట చేస్తానని అంటుంది. అప్పుడు మురారి వద్దు అని రాత్రి తిన్న ధాబాలో తిందామని అంటాడు.

ఆదర్శ్‌: భద్రంగా దాచుకున్న పెన్సిల్ తీసి.. కృష్ణ నీకు ఈ పెన్నిల్ కథ ఏంటో తెలుసా..
మురారి: రేయ్ ఆదర్శ్‌ వద్దురా ఇప్పుడు.
కృష్ణ: ఏంటి ఏసీపీ సార్ మీరు ఎందుకు ఆ పెన్సిల్ చూసి భయపడుతున్నారు.
ఆదర్శ్: ఏసీపీ సార్ అడుగుతున్నారు కదా చెప్పండి.
మురారి: రేయ్ వద్దురా.. ఏం లేదులే కృష్ణ అక్కడికి వెళ్లడానికి లేట్ అవుతుంది. వెళ్లి ఫుడ్ రెడీ చెయ్.
ఆదర్శ్‌: ఏసీపీ సార్ ఇప్పుడే కదా బయట తిందాం అన్నారు.
మురారి: రాత్రంతా డ్రైవింగ్ చేశాకదా నిద్ర వస్తుంది వెళ్లి పడుకుంటా..
ఆదర్శ్‌: ఏసీపీ సార్ వెళ్లేటప్పుడు నేను డ్రైవింగ్ చేస్తాను మీరు బ్యాక్ సీట్‌లో పడుకుందువు గానీ..
మురారి: వదలవా.. ఇద్దరూ కలిసి నన్ను చంపుతున్నారు.
కృష్ణ: ఆదర్శ్ ప్లీజ్ చెప్పవా..
ఆదర్శ్‌: చెప్తాను కృష్ణ.. ఏం లేదు కృష్ణ. మేం అప్పుడు ఎనిమిదో, తొమ్మిదో తరగతి..
మురారి: తొమ్మిది..
ఆదర్శ్‌: అబ్బచా అంటే నువ్వు ఇంకా మర్చిపోలేదు అన్నమాట. అప్పుడు మేం 9వ తరగతిలో ఉన్నప్పుడు వీడి పక్కన స్వర్ణ అనే అమ్మాయి ఉండేది. ప్రిన్సిపల్ కూతురు. వీడికి ఆ స్వర్ణ పెద్ద క్రష్.
కృష్ణ: అబ్బో సార్ అప్పుడు నుంచే పెద్ద రొమాంటిక్ అన్నమాట.
ఆదర్శ్‌: ఒకసారి లంచ్ బ్రేక్‌లో స్వర్ణ పెన్సిల్ పడిపోయింది. దాన్ని వీడు నొక్కేసి నాకు ఇచ్చాడు. టెన్త్ అయ్యే వరకు ఈ పెన్సిల్‌నే చూసేవాడు. అంతేకానీ ఆ స్వర్ణతో ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాడు. వీడు ఆ విషయం మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు. నాతోనే వీడి జ్ఞాపకంగా తెచ్చుకున్నాను. మళ్లీ ఆ రోజులు వస్తే బాగున్ను.
కృష్ణ: వస్తాయి ఆదర్శ్‌.. కానీ ఒక విషయం ముకుందకు నీ మీద కోపం ఉండొచ్చు చెప్పకుండా వెళ్లిపోయావు అని..
మురారి: ముకుందకు నీ మీద కోపం పోయి ఆ స్థానంలో ప్రేమ కలిగించాల్సిన బాధ్యత నీదే.
కృష్ణ: ఏం ఆలోచిస్తున్నారు. అప్పుడు ముకుంద వేరు ఇప్పుడు ముకుంద వేరు.
ఆదర్శ్: మీరు భ్రమ పడుతున్నారు.
మురారి: లేదురా మేం భ్రమ పడటం లేదు ముకుంద ఆ భ్రమ నుంచి బయటకు వచ్చింది. ఆ నమ్మకంతోనే మేం ఇక్కడి వరకు వచ్చాం.
ఆదర్శ్‌: సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నాకు నమ్మకం వచ్చింది.

ఇక ఆదర్శ్ వెళ్లిపోతున్నాడు అని ఆ చుట్టుపక్కల వారు ఆదర్శ్‌ కోసం అక్కడి వెరైటీలు పట్టుకొని వస్తారు. ఆదర్శ్‌ వెళ్లిపోతాను అని చెప్తే వాళ్లు బాధ పడతారు. ఇక కృష్ణ భవానికి ఫోన్ చేస్తుంది. భవాని స్పీకర్ ఆన్ చేస్తుంది. ఆదర్శ్‌ని కలిశామని.. తమతో పాటు తీసుకొస్తామని కృష్ణ చెప్తుంది. భవాని ఎమోషనల్ అవుతుంది. మరోవైపు ముకుంద టెన్షన్ పడుతుంది.

భవాని: మనసులో.. వాడు వస్తున్నాడు సరే ముకుంద నిజంగా మారిపోయిందా.. మురారిని మర్చిపోయి ఆదర్శ్‌కు తన జీవితంలో చోటు ఇస్తుందా.. సరే సరే మీరు జాగ్రత్తగా రండి..
మధు: ఎప్పుడో రెండేళ్ల క్రితం దూరమైన సంతోషాన్ని కృష్ణ, మురారిలు తీసుకొస్తున్నారు. ఆదర్శ్‌ వస్తున్నాడు అని అందరూ సంతోషంగా ఉంటే ముకుంద ఏంటి ముఖం మాడ్చుకుంది. అంటే సంథింగ్ రాంగ్.
ముకుంద: అవునా వచ్చేస్తున్నారా.. అత్తయ్య ఏ టైంకి వస్తున్నారో చెప్పారా..
భవాని: సాయంత్రానికి వచ్చేస్తారు అంట. చీకటి పడేలోపు వచ్చేస్తారు.
మధు: ముకుంద బయట పడకూడదు అని చేస్తున్న హడావుడే తప్ప మనసులో ఆదర్శ్ మీద ఏ ఫీలింగ్ లేనట్లు ఉంది. అలాంటప్పుడు ఆదర్శ్‌ వస్తే ఏం లాభం. మళ్లీ కథ మొదటికే వస్తుంది కదా..
ముకుంద: అయ్యో.. ఇప్పుడు నేను ఏం చేయాలి. నేను మారిపోయాను అని చెప్పారు కదా.. మనసులో ఎన్నో ఆశలతో ఆదర్శ్ తిరిగి వస్తుంటాడు. తనకి నేను ఏం సమాధానం చెప్పాలి. మురారి మర్చిపోవడం సాధ్యం కావడం లేదే. అలా అని ఆదర్శ్‌కి నో చెప్తే నేను మారిపోయాను అని నమ్ముతున్న అందరూ ఏమైపోతారో. పోని ఎవరు ఏమైపోతే నాకు ఏంటి అని ముందులా ఆలోచించి మురారిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తే కృష్ణ జీవితం ఏమైపోతుంది. అలా అని మనసు చంపుకొని ఆదర్శ్‌తో జీవితం పంచుకోవడం కూడా సాధ్యం కాదు. ఏం చేయాలి.
మధు: ఏంటి ముకుంద తల పట్టుకొని కూర్చొన్నావు.
ముకుంద: ఏం లేదు రాత్రంతా నిద్రలేదు. అందుకే ఇలా కనిపిస్తున్నా.
మధు: ఏదో కవర్ చేస్తుంది. ఈ టెన్షన్ చూస్తేంటే ఆదర్శ్‌ వస్తే మళ్లీ ఇంట్లో చిచ్చు రేగడం ఖాయం.
ముకుంద: వీడికి నా మీద అనుమానంతో నా మనసులో ఏం ఉందో తెలుసుకోవాలి అని వచ్చాడు. ఇప్పుడు నేను నిజం చెప్పే ధైర్యం చేయగలనా.. అని ముకుంద అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read:'ప్రేమ ఎంత మధురం' సీరియల్ జనవరి 23rd: జలంధర్ ఎత్తుని చిత్తు చేసిన ఆర్య, సుగుణకి అడ్డంగా దొరికిపోయిన అను

ఇంటికి వచ్చేస్తున్న ఆదర్శ్.. టెన్షన్‌తో తలపట్టుకున్న ముకుంద! (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Foster Heidenreich CPA

Last Updated:

Views: 5901

Rating: 4.6 / 5 (56 voted)

Reviews: 95% of readers found this page helpful

Author information

Name: Foster Heidenreich CPA

Birthday: 1995-01-14

Address: 55021 Usha Garden, North Larisa, DE 19209

Phone: +6812240846623

Job: Corporate Healthcare Strategist

Hobby: Singing, Listening to music, Rafting, LARPing, Gardening, Quilting, Rappelling

Introduction: My name is Foster Heidenreich CPA, I am a delightful, quaint, glorious, quaint, faithful, enchanting, fine person who loves writing and wants to share my knowledge and understanding with you.